ప్రజాశక్తి - మంత్రాలయం
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నట్లు వైసిపి రాష్ట్ర యువ నేత వై.ప్రదీప్ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మాధవరం గ్రామంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసిపి మండలాధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి, మాజీ జడ్‌పిటిసి మిసల్ రాజశేఖర్ రెడ్డితో కలిసి 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. ముందుగా సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా రూ.21,59,68,649 లబ్ధి చేకూర్చినట్లు బోర్డును ఆవిష్కరించారు. వాలంటీర్లుకు కిట్లు పంపిణీ చేశారు. సచివాలయం నుంచి ర్యాలీగా సర్కిల్ వరకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వైసిపి జెండాను ఎగురవేశారు. అక్కడి నుంచి రాజశేఖర్ రెడ్డి ఇంటి వరకు ఊరేగింపు నిర్వహించారు. వైసిపి నాయకులు రోగప్ప, ఉప సర్పంచి చిట్టెమ్మ, జంగం వీరన్న స్వామి, భీమిరెడ్డి, బసవరాజు, వీరారెడ్డి, హనుమంతు రెడ్డి, జగన్నాథ్, పైబాయి వెంకట రెడ్డి, అల్లం బాష, మాబాష, కురువ విజరు, నరసింహులు, దేవా రెడ్డి, ముల్లా ఇస్మాయిల్, వలీ, వగరూరు బ్రదర్స్ పాలరాజు, అరుణ్, ఆంధ్రయ్య, దావీదు, పెద్ద లోకప్ప, చిన్న లోకప్ప, ఫరీద్, చిన్న ఖాజా, రామయ్య పాల్గొన్నారు.