
ప్రజాశక్తి -నక్కపల్లి:అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. మండలంలోని ఉపమాకలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను లబ్ధిదారులు అందజేసి సంక్షేమ ఫలాలపై ఆరా తీశారు. ఉపమాక పంచాయతీ మామిడివానిపాలెంలో జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఈ పథకంతో ఇంటింటికీ తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నం, జడ్పిటిసి సభ్యురాలు కాసులమ్మ, వైస్ ఎంపీపీ నానాజీ, పార్టీ మండల శాఖ అధ్యక్షులు శీరం నరసింహ మూర్తి, నక్కపల్లి పిఎసిఎస్ పర్సన్ ఇన్‌చార్జి ఎలమంచిలి తాతబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కొప్పిశెట్టి హరిబాబు, వైసీపీ నాయకులు కొల్లాటి బుజ్జి ,సిద్దాబత్తుల నూకతాత, మనబాల తాతారావు, సత్తిబాబు, సూరకాసుల గోవింద్, గొర్ల బాబురావు, తహసీల్దార్ అంబేద్కర్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈ ఓపిఆర్‌డి వెంకటనారాయణ, పంచాయతీ కార్యదర్శి జయప్రకాష్ పాల్గొన్నారు.