ప్రజాశక్తి-యంత్రాంగం పిఠాపురం అభివద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం పిఠాపురం నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథం బస్సు యాత్ర సాగింది. పట్టణంలోని గోర్స రోడ్డులో ఉన్న టిడ్కో గహ సముదాయాలను, పాలిటెక్నిక్ కళాశాలను, ఆర్‌ఆర్‌బిహెచ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడాస్థలంలో నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియాన్ని యాత్ర బందం పరిశీలించింది. ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో యాత్ర సాగింది. సాయంత్రం స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌విఎస్‌ఎన్ వర్మ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్‌లో ఉన్నా చంద్రబాబు అటు అభివద్ధిని సంక్షేమాన్ని సమానంగా చేసి చూపారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్‌ను సిఎం చేస్తే అన్ని వర్గాల ప్రజలు నేడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడారు. ఎంఎల్‌ఎలకు కనీసం సిఎం దగ్గర అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని, ఇక ప్రజా సమస్యలు ఏం పరిష్కరిస్తారని ప్రశ్నించారు. సామర్లకోటలోని పూర్ణ కళ్యాణ మండపంలో ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోమ్ మంత్రి, ఎంఎల్‌ఎ చినరాజప్ప మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. సభకు జగ్గంపేట మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రు అధ్యక్షత వహించారు. నల్లమిల్లి రామకష్ణారెడ్డి, మాజీ మంత్రులు కెఎస్.జవహర్, చిక్కాల రామచంద్రరావు, మహాసేన రాజేష్, వల్లూరి శ్రీనివాసు, తోటకూర శ్రీనివాస్, అరుణ్ వంశీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల నెహ్రూ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు. యు.కొత్తపల్లి తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టిడిపి బస్సు యాత్రలో భాగంగా యు.కొత్తపల్లిలోని ఉప్పాడలో పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎ వర్మ, కృష్ణుడితో కలిసి రవీంద్ర ఫిషింగ్ హార్బర్, జియో ట్యూబును పరిశీలించారు. మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్క్ పరిశ్రమ రావడం వల్ల మత్స్యకారులు జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే దాని ద్వారా వచ్చే కలుషిత జలాలను సముద్రంలో కాక వేరే విధంగా తరలించాలని సూచించారు. రూ.420 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో గట్లు సక్రమంగా వెయ్యకపోవడంతో బోట్లు వెళ్లే సమయంలో తెరలు అధికం కావడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సూరాడ రాజు, చోడిపల్లి ప్రసాద్, సూరాడ జగన్నాథం, పరమల్ల వీరాస్వామి, కష్ణ, సనపయ్య, వేమగిరి రాంబాబు పాల్గొన్నారు.










