Dec 06,2022 23:50

ప్రజలకు ప్రభుత్వ పథకాల కరపత్రాలు అందిస్తున్న మంత్రి, ఎంపీ

ప్రజాశక్తి-అనకాపల్లి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ బివి సత్యవతి అన్నారు. జీవీఎంసీ 84వ వార్డు పరిధి కోట్ని వీధిలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు గోరుముద్దలు తినిపించారు. కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ పలక యశోద రవి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌ కుమార్‌, పట్టణ అధ్యక్షులు మందపాటి జానీ, నాయకులు పలక రవి, జాజుల రమేష్‌, ఏవి రత్నకుమారి, కొణతాల మురళీకృష్ణ, కోరుకొండ రమేష్‌, బొడ్డేడ శివ, మొగలపల్లి రవితేజ, జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, తహశీల్దార్‌ గంగాధర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.