
డిసిసిబి ఛైర్మన్ నరసింహరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు
వైసిపి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పేట వేసి ముందుకు సాగుతోందని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. మోగల్లు పంచాయతీ పరిధిలోని గుత్తులవారి పాలెంలో జల జీవన్ మిషన్ నిధులు రూ.18 లక్షలతో ఒహెచ్‌ఆర్ నిర్మాణానికి డిసిసిబి ఛైర్మన్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం విస్సాకోడేరులో రూ.20 లక్షలతో నిర్మించనున్న ఐదు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంతోషం వ్యక్తం చేస్తూ స్థానికులు పివిఎల్‌ను, ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణ రాజును, సర్పంచి బొల్ల శ్రీనివాసును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి నాగరాజు, ఎంపిటిసి బి.గాంధీ పాల్గొన్నారు.