ఆదర్శంగా నిలిపేందుకు సర్పంచి యడ్ల మోహన్‌రావు కృషి
ప్రజాశక్తి - చింతలపూడి
మండలంలోని యండపల్లి పంచాయతీని సర్పంచి యడ్ల మోహన్‌రావు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మండలంలోనే యండపల్లి పంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా ఎంఎల్‌ఎ, ఎంపిపి, జెడ్‌పిటిసి నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, శ్మశానవాటికలు, సీసీ రోడ్లు, మంచినీటి బోర్లు ఇలా పంచాయతీలో రూ.కోట్ల అభివృద్ధి పనులు ఎంఎల్‌ఎ ఎలిజా సహకారంతో చేస్తున్నామని, ఇంకా చేస్తామని సర్పంచి యడ్ల మోహన్‌రావు చెబుతున్నారు.
చింతలపూడి మండలంలోని యండపల్లి గ్రామంలో 2020లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా యడ్ల మోహన్‌రావు గెలుపొందారు. గెలిచిన దగ్గర నుంచి పంచాయతీకి ఏదోవిధంగా నిధులు తీసుకువచ్చి పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
పంచాయతీలో అభివృద్ధి పనులు
సర్పంచిగా పదవి భాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 68 నూతన పింఛన్లు మంజూరు చేయించారు. రెండు కిలోమీటర్ల సీసీ రోడ్లకు రూ.80 లక్షలు మంజూరు చేయించారు. ఎస్‌సి కాలనీకి రూ.12 లక్షలు, బిసి కాలనీకి రూ.ఆరు లక్షల నిధులు మంజూరు చేయించారు. ఎంపిపి నిధుల నుంచి రూ.16 లక్షలు, ఎంఎల్‌ఎ నిధుల నుంచి రూ.4.90 లక్షలు మంజూరు చేయించారు. బిసి కాలనీలో అంగన్‌వాడి కేంద్రం భవనాన్ని ఎంఎల్‌ఎ సహకారం రూ.ఆరు లక్షలతో నిర్మించారు. విద్యుత్ లో ఓల్టేజ్ వల్ల విద్యుత్ పరికరాలు కాలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే 12 సింగిల్ ఫేజ్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ని ఏర్పాటు చేయించారు. జలకళ ద్వారా యండపల్లి పంచాయతీలోనే 12 బోర్లు వేయించారు. పంచాయతీలో 86 నూతన గృహాలు, 96 ఇళ్ల స్థలాలు కేటాయించారు. మరో 12 ఇళ్ల స్థలాలు మంజురు చేయాలని ఎంఎల్‌ఎను కోరారు. 86 విద్యుత్ స్తంభాలు, జగనన్న లే అవుట్ ద్వారా రూ.4.50 లక్షలతో మంచినిటి బోరు వేయించారు. పంచాయతీలో తాగునీటి కొరత లేకుండా నాలుగు బోర్లు వేయించారు.
గడపగడపకూ మన ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా యండపల్లి గ్రామంలో 86 నూతన విద్యుత్ స్తంభాలు, జలజీవన్ పథకం కింద రూ.6.80 లక్షలతో పైపులైన్లు వేయించారు. యండపల్లి గ్రామంలో ఎస్‌సి, బిసి శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.4.50 లక్షలు మంజూరు చేయించారు. గడపగడపకూ మన ప్రభుత్వంలో యండపల్లి పంచాయతీలో సమస్యలు పరిష్కారానికి రూ.9.80 లక్షల మంజూరు చేయించారు. ఎస్‌టి ఏరియాలో రూ.4.80 లక్షలతో సీసీ డ్రెయినేజీలు, యండపల్లి గ్రామంలో రూ.6.50 లక్షలతో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. ఎస్‌టి కాలనీ వాటర్ ట్యాంకర్స్ శుభ్రతకు రూ.2.60 లక్షలు మంజూరు చేయించారు. రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్ క్లినిక్, హాస్పిటల్, సచివాలయం, నాడు-నేడు నిర్మాణాలు కూడా ఆయన హయాంలో పూర్తయ్యాయి.
బిటి రోడ్డుకు రూ.1.20 కోట్లు
రాఘవపురం నుంచి యండపల్లి మల్లేశ్వరం మీదుగా రోడ్డు సరిగా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. దీంతో సర్పంచి యడ్ల మోహన్‌రావు ఎంఎల్‌ఎ ఎలిజాను కోరి ఆ రోడ్డుకు నిధులు మంజూరు చేయిం చుకుని పనులు కూడా జరిగేటట్లు కృషి చేశారు.
పంచాయతీని జిల్లాలోనే ప్రథమస్థానంలోకి తీసుకెళ్లాలి
యడ్ల మోహన్‌రావు, యండపల్లి సర్పంచి
మండలంలోనే యం డపల్లికి అత్యధికంగా ఎంఎల్‌ఎ ఎలి జా సహకరంతో నిధులు మంజురు చేయించుకోని అభివృద్ధి చేసుకుం టున్నాం. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలానే ఉంది. ఎంపిపి, జెడ్‌పిటిసి సహాయసహకారాలతో యండపల్లి పంచాయతీని అభివృద్ధిలో జిల్లాలోనే మొదటి స్థానంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం.










