Oct 17,2023 22:25

అభివృద్ధి పథంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: విసి

అభివృద్ధి పథంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: విసి

ప్రజాశక్తి - క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధి పథంలో సాగుతోందని విసి ఆచార్య డి. భారతి అన్నారు.శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో పరిపాలన భవనానికి ఆనుకొని పొడిగింపు నూతన భవన నిర్మాణ పనులను వర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. భారతి మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా వర్సిటీ రాష్ట్రంలోని అన్ని వర్సిటీలతో పోలిస్తే అభివద్ధి పథంలో ముందుకు నడుస్తోందన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా తరగతులను నిర్వహించడం, పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను వెంటనే వెల్లడిస్తున్నామన్నారు. బోధన, పరిశోధనా రంగాల్లో కూడా వివిధ విదేశీ విశ్వవిద్యాలయాలతోనూ, పరిశ్రమలతోనూ, సంస్థలతోనూ సహకార అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడంలో వర్సిటీ అధ్యాపకుల బందం కషి ఎనలేనిదన్నారు. పరిపాలన భవనానికి అనుబంధంగా ఉన్న నూతన భవనంలో అంతర్జాతీయ విద్యార్థిని సంబంధాల కార్యాలయాన్ని కార్యాలయానికి కేటాయించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలతో సహాయ, సహకార, ఒప్పందాల, అవగాహన, ఒడంబడికలను చేసుకోవడానికి సులభతరంగా ఉంటుందన్నారు. మహిళా వర్సిటీలో విద్యార్థినులకు ఉన్నతమైన అవకాశాలను అందించే దిశగా క్యాంపస్‌ ప్లేస్మెంట్లను ప్రతి విభాగం తరఫున ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ నూతన భవనంలో అంతర్జాతీయ సంబంధాలు, పరీక్షల విభాగం, సెంట్రల్‌ నెట్వర్కింగ్‌ ఫెసిలిటీ కి కేటాయించబడి మూడు ఫ్లోర్లలో పరిపాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌. రజిని అంతర్జాతీయ విద్యార్థిని సంబంధాల డీన్‌ ఆచార్య విజయలక్ష్మి, అధ్యాపకుల సంఘం కార్యదర్శి ఆచార్య త్రిపుర సుందరి, ఉమా మహేశ్వరి దేవి, నీలిమ, శ్రీరజిని, పద్మజ, తదితరులు పాల్గొన్నారు.