అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడడం లేదా..?
- మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాం
- ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాలలో చేస్తున్న అభివద్ధి ప్రతిపక్షాలకు కనపడడం లేదా.. ఇంత జరుగుతన్నా ఏమీ లేదని టిడిపి నాయకులు చెప్పడం విడ్డురంగా ఉందని, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నామని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి టిడిపి నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డు వైఎస్ నగర్‌లో 1 కోటి 60 లక్షల అభివృద్ధి పనులను కౌన్సిలర్ సావిత్రమ్మ, జిల్లా కల్చరల్ విభాగం అధ్యక్షులు టివి రమణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు ప్రారంభించారు. ముందుగా వైఎస్ నగర్‌లో రూ.80 లక్షలతో నిర్మించిన మెయిన్ డ్రైన్‌ను ప్రారంభించారు. అలాగే రూ.80 లక్షలతో చేపట్టే సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి జరగడంలేదని, కాకమ్మ కబుర్లు చెబుతున్నామని టిడిపి నాయకులు విమర్శించడం తగదన్నారు. వైఎస్ నగర్‌లో నూతనంగా ఒక కోటి 20 లక్షలతో అర్బన్ హెల్త్ సెంటర్‌ను నిర్మిస్తున్నామన్నారు. టిడిపి నాయకులు అవసరమైతే అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషావలి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిమ్మా నాగన్న, అంకాలయ్య, అన్వర్ బాషా, నరసింహ రావు, వెంకటస్వామి శెట్టి, బాబురావు, సోమశేఖర్, జాకీర్, కృష్ణ రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










