ప్రజాశక్తి -సాలూరు : మున్సిపాలిటీ పరిధిలో అభివద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజారోగ్య శాఖ ఎస్‌ఇ పి.గణపతిరావు ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన పట్టణంలోని వైటిసి వద్ద నిర్మాణంలో అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌ను, రామాకాలనీలో నిర్మించనున్న పార్క్‌ను ఆయన పరిశీలించారు. అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.19లక్షలతో టెండర్లు పిలవాలని ఆదేశించారు. రామాకాలనీలో రూ.50లక్షలతో అభివృద్ధి చేయనున్న పార్క్ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి విద్యుత్ సరఫరా సౌకర్యాలకు సంబంధించిన పనులను రూ.8కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అనంతరం వార్డు అమెనిటీస్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అభివద్ది పనులను త్వరితగతిన జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రజారోగ్య శాఖ ఇఇ జి.శ్రీరామమూర్తి, టెక్నికల్ ఆఫీసర్ కె.ఫణికుమార్, ఇంఛార్జి డిఇ సూరి నాయుడు, వర్క్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వున్నారు.










