Jun 03,2023 23:59

మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి లక్ష్మిపతి

ప్రజాశక్తి -ఎస్‌.రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను డిఆర్‌డిఎ స్పెషల్‌ ఆఫీసర్‌ లక్ష్మీపతి ఆదేశించారు. శనివారం ఎంపిడివో కార్యాలయంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇంకా జగనన్న ఇళ్ళు పూర్తి కాలేదని ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ పనులు ఎందుకు పూర్తి కాలేదని ఆయన పలువురు సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. గుడివాడ, పెదఉప్పలం, కోనవానిపాలెం, లింగరాజుపాలెం గ్రామాల్లో జగనన్న ఇళ్ళు, నాడు నేడు పధకం ద్వారా మంజూరైన పాఠశాల మరమ్మత్తులు, నూతన పాఠశాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అందచేస్తున్న పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీరామ చంద్రమూర్తి, ఈవోపిఆర్డి సత్యన్నారాయణ, మండల విద్యాశాఖాధికారి మూర్తి, హౌసింగ్‌ ఎఇ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.