ప్రజాశక్తి- చీరాల : చీరాల పట్టణంలో నిర్వహిస్తున్న పలు అభివద్ధి పనులను ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి మంగళ వారం పరిశీలిం చారు. తొలుత స్వర్ణ గేటు సమీపంలో మూడవ రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని పరిశీలి ంచారు. అనంతరం పైపులైను మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను పరి శీలించారు. అనంతరం దండుబాట రోడ్డు నుండి ఈపురిపాలెం స్ట్రైట్ గట్టు కాలువ వరకు మురుగునీరు పారుదలకు చేపట్టిన కాలువ పూడిక పనులు లను ఆయన పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీ పనులు త్వరగా పూర్తిచేసి మురుగు నీరుపారుదలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వేగవంతంగా పూడిక పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, డిఇ ఐసయ్య,ఎలక్ట్రికల్ ఏడీ శ్రీనివాసులు,రైల్వే డిపార్ట్మెంట్ ఎఒ మోహన్,ఠాగూర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు










