సీసీ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కరణం బలరాం
ప్రజాశక్తి-చీరాల: పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బలరామకృష్ణ మూర్తి బుధ వారం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డితో కలిసి పరిశీలిం చారు. ముందుగా 31వ వార్డులో నూతనంగా నిర్మిస్తు న్న శ్మశాన వాటికను ఆయన పరిశీలించారు. నిర్మాణ విషయంలో నాణ్యతను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని 29వ వార్డులో ఇటీవల నిర్మించిన సిమెంటు రోడ్డును ఆయన పరిశీలించారు. ఆయన వెంట మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపాలిటీ డిఇ ఐసయ్య, వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.










