ప్రజాశక్తి -వెంకటాచలం :రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసాధారణ నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం పాలిచర్లపాడు గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్, సిసి రోడ్లు, డ్రెయిన్లు, మొదలైన రూ. 1.30 కోట్ల విలువైన అభివద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు బాటలు వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి మంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత, ఎంపిడిఒ రమేష్, ఎంపిపి కవిత, సర్పంచ్ వెంకటేశ్వర్లు, వైసిపి ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఉప ఎంపిపి కోదండ రామిరెడ్డి, రాచాల రవికుమార్ యాదవ్, మండల కన్వీనర్ మోహన్ నాయుడు సర్పంచులు కడివేటి శివ, అక్బర్ బాషా, అడపాల ఏడుకొండలు ఉన్నారు.










