ప్రజాశక్తి -పొదలకూరు : వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ..జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణంలో బుధవారం ఆయన వివిధ అభివద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమైనా అరా, కొరా మిగిలిపోయిన పనులు ఉంటే వాటి మీద దష్టి పెట్టి పూర్తి చేస్తామన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్లకు ఇక్కడి ప్రజల మనోభావాలు తెలియదన్నారు. గ్రామాలకు దారులు తెలిసిన వాళ్ళు కాదని, గ్రామ ప్రజల అవసరాలు తెలిసిన వాళ్ళు కాదని విమర్శించారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ,69 లక్షల రూపాయల తో నిర్మించిన సైడ్ డ్రైన్లకు, 45 లక్షలతో నిర్మించిన రైతు బజారుకు, 40 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనానికి ప్రారంభోత్సవం చేసినట్లు చెప్పారు. రైతు బజార్ సిఇఒ నందకిషోర్ రెడ్డి, పొదలకూరు సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ, జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి. రమణారెడ్డి, కోణం. చిన్న బ్రహ్మయ్య, మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, ఎం. శేఖర్, సోమా భాస్కర్, వేణుగోపాల్ రెడ్డి ,ఎం. శివ శంకర్, లక్ష్మీ కళ్యాణి, భారతమ్మ, తహశీల్దార్ వీర వసంత్ కుమార్, ఎంపిఇఒ నగేష్ కుమారి ఉన్నారు.










