Nov 03,2022 00:13

మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి ఉదయశ్రీ

ప్రజాశక్తి-కోటవురట్ల:మండల సమావేశం మందిరంలో మండల స్థాయి అధికారులతో మండల ప్రత్యేక అధికారి, నర్సీపట్నం డిఎల్‌డిఓ ఉదయశ్రీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి మాట్లాడుతూ, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా చేపడుతున్న జగనన్న కాలనీలపై ప్రత్యేక అధికారి ఆరా తీశారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగనన్‌ కాలనీ ఇళ్ళను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, మండల టిఆర్‌ఎస్‌ వర్మ, హౌసింగ్‌ ఏఈ జగదీశ్వరరావు, ఏఈ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ కరుణ, సిడిపిఓ సుజాత, పిఓపిఆర్డి ప్రేమ్‌ సాగర్‌, పలు శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.