Oct 12,2023 21:24

అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో డిప్యూటీ సిఎం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
: జిడి నెల్లూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు గురించి గురువారం మధ్యాహ్నం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌తో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి సమావేశమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అంశాలు, అభివద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌.పురం జడ్పీటిసి రమణ ప్రసాద్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిన్నబ్బ రెడ్డి, మాజీ జడ్పీటిసి బీరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.