అభివృద్ధి పనులను వేగవంతం చేయండి : కమిషనర్
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత సూచించారు. తిరుపతి నగరంలో చేపట్టబోయే పనుల్లో అవకాశం వున్నంత వరకు ప్రజాభివద్దికి కషి చేయాలను డిప్యూటీ మేయర్ భూమన అభినరు రెడ్డి కోరారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశం కమిషనర్ హరిత సమక్షంలో జరిగింది. డిప్యూటీ మేయర్, కమిషనర్ మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన ప్రీ లెప్టులు వలన చాలా ఉపయోగకరంగ వున్నాయని, మరిన్ని ప్రాంతాల్లోనూ ప్రీ లెప్టుల ఏర్పాటుకు ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. నగరంలో సుందరీకరణలో భాగంగ కొన్ని ముఖ్య కూడల్లలో పచ్చదనం పెంపు, ఆహ్లాదం, విజ్ఞానం పెంచే విగ్రహాల స్థాపన చేసే విషయంలో అధికారులు పరిశీలించాలన్నారు. ఇటివల ప్రారంభించిన మ్యూజిక్ కళాశాల ఐలాండ్ వద్ద ఏర్పాటు చేసిన సంగీత వాయిద్య నమూన పరికరాలు ప్రజలను ఆకట్టుకుంట్టున్నాయని, అదేవిధంగా ఎం.ఆర్.పల్లె సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన మహాత్మాగాంధీ దండి మార్చ్ విగ్రహాలు ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తిని తీసుకువచ్చిన విషయాలను కమిషనర్ వివరించి, అలాంటివి తరహాలో మరిన్ని ఉంచేలా కొన్ని కూడళ్లను ఎంపిక చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
గృహనిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
తిరుపతి నియోజకవర్గం పరిధిలో మంజూరైన అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి నియోజకవర్గ అభివద్ధికి సంబంధిత అధికారులు కషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి నియోజకవర్గ సమీక్ష సమావేశం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ.. ఏపీ టిడ్కో ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి పేమెంట్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.










