May 26,2023 23:48

తారురోడ్డు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కార్పొరేటర్‌ హేమలత

ప్రజాశక్తి -మధురవాడ: జివిఎంసి ఐదోవార్డులో జరుగుతున్న పలు అభివృద్ధి, నిర్మాణ పనులను వార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత శుక్రవారం పరిశీలించారు. బొట్టవానిపాలెంలో రూ.16లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి డ్రెయిన్స్‌, రాజీవ్‌ గృహకల్ప కాలనీలో రూ.17లక్షలతో బిటి రోడ్డు పనులను, నేషనల్‌ హైవే నుంచి కార్పెంటర్‌ కాలనీ వరకు రూ. 20లక్షలతో బిటి రోడ్డు నిర్మాణం, నగరంపాలెంలో కాలువలు, కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతపై అక్కడి అధికారులు, కాంట్రాక్టర్లకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్‌ హేమలత మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో వార్డులో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు తాగునీరు, రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మాణం తదితర సమస్యలపై పలుమార్లు కౌన్సిల్‌లో ప్రస్తావించామన్నారు. ఈ మేరకు మంజూరైన ని
ధులతో ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపడుతున్నామన్నారు. ఇంకా చాలాచోట్ల అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ఉందని, వీటిని కూడా తొందరలో పూర్తి చేసేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.