Apr 21,2023 00:24

మంగళగిరి: మంగళగిరి పట్టణంలో జరుగుతున్న పలు అబి óవృద్ధి పనులను రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హను మంతరావు, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి గురువారం పరిశీలించారు. కోనేరులో జరుగుతున్న మరమ్మతు పనులను, పాత బస్టాండ్‌ సెంటర్లో జరుగుతున్న చేనేత భవన్‌ నిర్మాణ పనులను, రాజీవ్‌ గహకల్ప లో జరుగు తున్న మగ్గాల షెడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎంపి అన్నారు.