అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల పట్టణంలోని 28వ వార్డులో 21 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీలు, పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాం షావలి, దృశ కళల డైరెక్టర్ సునీత, అమృతరాజ్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, రహంతుల్లా స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు అనేకం నిరంతరం చేపడుటున్నామని తెలిపారు. నంద్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. గతంలో విస్మరించిన పనులను పునరుద్ధరిస్తూ, పరిష్కరిస్తూ పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ పట్టణ అభివృద్ధిని చేపడుతున్నామని తెలిపారు. నంద్యాల పట్టణంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఇది ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను గమనించాలని కోరారు.










