Nov 22,2022 00:26

సిసి రోడ్లు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన చేస్తున్న కెకె.రాజు

ప్రజాశక్తి-యంత్రాంగం
కంచరపాలెం : జివిఎంసి 49వ వార్డు పరిధి కొండవాలు ప్రాంతం సింగరాయిమెట్ట వద్ద రూ.20 లక్షలతో రిటైనింగ్‌ వాల్‌, సీసీ రోడ్లు, డ్రెయిన్లు తదితర పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్‌ అల్లు శంకరరావు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిఇ భరణికుమార్‌, ఎఇ అర్చన, డైరెక్టర్‌ ఎన్‌.రవికుమార్‌, ఆదిరెడ్డి శ్రీను, చంద్ర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌సిఐ పార్క్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
53వ వార్డు పరిధి ఎఫ్‌సిఐ పార్కు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్‌ బర్కత్‌ అలీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌సిఐ పార్క్‌ రిటైనింగ్‌ వాల్‌ మరమ్మత్తులు, పెయింటింగ్‌కు వార్డు అభివృద్ధి నిధులు రూ.6 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
51వార్డులో..
మాధవధార : జివిఎంసి 51వ వార్డు పరిధి అంబేద్కర్‌ కాలనీలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు వార్డు కార్పొరేటర్‌ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యాన ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు శంకుస్థాపన చేశారు.
50వ వార్డులో...
జివిఎంసి 50వ వార్డు పరిధి మాధవధారలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు తదితర అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కెకె.రాజు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల్లో డిఇ భరణి కుమార్‌, ఎఇ అర్చన, పైడి శ్రీను, విశ్వనాధరాజు, పైడి ప్రతాప్‌, ప్రసన్నరెడ్డి, దమయంతి, వసంతల అప్పారావు, వరలక్ష్మి, లక్ష్మణ్‌, నూకరాజు, శ్యామ్‌, రాణి, గణేష్‌, రెడ్డి, మోహన్‌ రావు, రాజేశ్వరరావు, శంకర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లు శంకరరావు, బగాతి విజరు, పి.అప్పారావు మాస్టర్‌, సోని, సరస, రాంబాబు, దమయంతి, శివాజి, ఆదిరెడ్డి శ్రీను, శివరాంప్రసాద్‌, సూర్య, చంద్రమౌళి, చందురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.