
ప్రజాశక్తి-పెందుర్తి, ఉక్కునగరం : జివిఎంసి 97వ వార్డు పరిధి ఎస్‌సి, బిసి కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అదీప్‌రాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని, ఆ దిశగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 97 శాతం నెరవేర్చామని తెలిపారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. ప్రజలకే నేరుగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని తెలిపారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ఉక్కునగరం : జివిఎంసి 85వ వార్డులో రోడ్లు, కాలువలు, ప్రహరీల నిర్మాణాలకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్య, వైద్యం ప్రతి పేదవానికీ అందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పటిష్ట చర్యలు చేపట్టారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 85వ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి, వైసిపి నాయకులు ఇల్లపు ప్రసాద్, బోరా సోమనాయుడు, చిన్న అప్పారావు, అప్పికొండ మహాలక్ష్మి నాయుడు, ఇల్లపు కొండలరావు, దానబాల అప్పలనాయుడు, సాలాపు అచ్చిబాబు, నక్క రమణ బాబు, చీరచిట్టి గోవిందు తదితరులు పాల్గొన్నారు.