Sep 12,2023 23:56

భూమి పూజ చేస్తున్న ఎంవివి సత్యనారాయణ, అక్కరమాని రోహిణి

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 12వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్‌ అక్కరమాని రోహిణితో కలిసి తూర్పు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఎంవివి.సత్యనారాయణ సోమవారం శంకుస్థాపన చేశారు. హెల్త్‌సిటీ సమీపంలో ఉన్న జివిఎంసి స్థలం చుట్టూ రూ.50 లక్షలతో ఫెన్సింగ్‌, స్థలంలో వాకింగ్‌ ట్రాక్‌, గేట్లు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ స్థలంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు కృషిచేయనున్నట్లు చెప్పారు. పనులు రెండు నెలల్లో పూర్తిచేసి స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్పొరేటర్‌ రోహిణి మాట్లాడుతూ, వార్డులో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సత్తి మందారెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, పిఐ బాలరాజు, చొక్కర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.