
ప్రజాశక్తి -గాజువాక : జివిఎంసి 85వ వార్డు అగనంపూడి నిర్వాసిత కాలనీలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గురువారం పలు అభివృద్ధి పనులు పనులకు శంకుస్థాపన చేశారు. కొండయ్యవలసలో రూ.20 లక్షలతో సామాజిక భవనం, డొంకాడలో రూ.20 లక్షలతో వరద నీటి కాలువ, బొర్రమాంబ ఉప్పర కాలనీలో రూ.50 లక్షలతో రక్షణ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే నాగిరెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి మాట్లాడుతూ, వార్డు పరిధిలో ముఖ్యమైన సమస్యలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లపు ప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జి.పూర్ణానందశర్మ. వైసిపి నాయకులు యలమంచిలి అప్పారావు, నక్క రమణబాబు, గెద్దాడ సత్యవతి, దాసరి సత్యవేణి బలిరెడ్డి శ్రీను దానబాల అప్పలనాయుడు గెద్దాడ అప్పలరాజు, పిల్లా కొండలరావు, ఐఆర్‌సిహెచ్ అప్పారావు, పిల్లా సురేష్, విందుల వరహాలు, జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.