
ప్రజాశక్తి -గాజువాక, సీతమ్మధార : జివిఎంసి 65వ వార్డు వాంబే కాలనీలోని షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని రూ.16 లక్షలతో రెండు సచివాలయాలుగా మార్చేందుకు, సంజీవిగిరి కాలనీలో రూ.10 లక్షలతో ప్రధాన కాలువ నిర్మాణానికి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడుతో కలిసి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువచేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు. గతంలో ప్రభుత్వ సేవలు పొందాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటి ముంగిటకే సేవలందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసిపి అధ్యక్షుడు మొదలవలస లోకనాధం, నగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, జుత్తు లక్ష్మి, మంత్రి మంజుల, సింగంపల్లి దేముడు, పుష్ప, అవంతి, సుందరరావు, గొల్లపల్లి రాంబాబు, ఫణి, విఘ్నేష్, ప్రసాద్, ఒడిశెల ఈశ్వరరావు, అన్నాజీ, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : జివిఎంసి 55వ వార్డు పరిధి తాటిచెట్టపాలెంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ కెవిఎన్.శశికళ ఆధ్వర్యాన ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులో రూ.56.21 లక్షల జివిఎంసి నిధులతో బిటి రోడ్లు, మేజర్ డ్రెయినేజీలు, సిసి రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 42వ ర్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, వైసిపి నాయకులు ఆళ్ల శ్రీనివాస్, అమర్ రెడ్డి, రత్నాకర్, గంగ మహేష్, ఎరంశెట్టి శ్రీను, ఎడ్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల గోపి, లక్ష్మి, నాగలక్ష్మి, వరలక్ష్మి, నాగ, పద్మప్రియ, బద్రి, జి.శ్రీనివాస్‌రెడ్డి, ధర్మేందరరెడ్డి, దివాకర్‌రెడ్డి, పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.