ప్రజాశక్తి-గోపాలపట్నం : జివిఎంసి 89వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. గణపతినగర్ కూడలి నుంచి సాయి గణేష్ మెడికల్ షాప్ వరకు రూ.4 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు, డ్రెయినేజ్ పనులకు, చంద్రనగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించే డ్రెయిన్లు, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అనంతరం జివిఎంసి కో-ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, వైసిపి నాయకులు అయితంశెట్టి గోపి, ఆళ్ళ పైడిరాజు, రైతు సంఘాల నాయకులతో కలిసి కొత్తపాలెం ప్రాంతంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాలను, పంట పొలాలను, కాలువలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దాడి భాస్కరరావు, బూరెల అప్పలనాయుడు. నమ్మి శ్రీను, సోషల్ మీడియా కో కన్వీనర్ స్పందన బాబూరావు తదితరులు పాల్గొన్నారు.










