Jul 14,2023 00:06

శంకుస్థాపన చేస్తున్న జెడ్‌పిటిసి

ప్రజాశక్తి -హుకుంపేట:జిల్లా పరిషత్‌ నిధులతో సీసీ రోడ్లకు జడ్పీటీసీ రేగం మత్స్యలింగం గురువారం శంకుస్థాపన చేపట్టారు. మండలం లోని తాడేపుట్టు పంచాయతీ ఉర్రడా గ్రామంలో రూ 3.00లక్షల వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ కాల్వల నిర్మాణంకు స్థానిక ఎంపీటీసీ కిలాగాడ సింహాచలం, సర్పంచ్‌ సోమేల సత్యవతి, బాకూరు సూపర్‌ ఎంపీటీసీ నైని సత్తి బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీటీసీ మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. సిసి రోడ్లు చక్కగా వేసుకోవాలని స్థానిక సర్పంచ్‌కి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ దీసరి వెంకట్రావు, లక్ష్మయ్య, వార్డ్‌ మెంబర్‌ సీదారి రాజారావు, వైసిపి నాయకులు అదేరి బొంజుబాబు, వాలంటర్‌ సన్యాసిరావు, రాంబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.