Jun 17,2023 00:10

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ మంగమ్మ

ప్రజాశక్తి -పిఎం.పాలెం : జివిఎంసి 7వ వార్డు పరిధి చంద్రంపాలెం, పాత పిఎం.పాలెం, కళానగర్‌ కాలనీల్లో రోడ్లు, సీసీ డ్రెయిన్ల అభివృద్ధి, వాంబే కాలనీ, దుర్గానగర్‌ కాలనీలో పార్కుల అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, 7వ వార్డు టిడిపి కార్పొరేటర్‌ పిల్లా మంగమ్మ శంకుస్థాపన చేశారు. ఏడవ వార్డు పరిధి పిలకవానిపాలెం సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రూ.78 లక్షలతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. విశాఖను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉన్నారన్నారు. అనంతరం బక్కన్నపలెం ప్రాంతానికి చెందిన వికలాంగురాలు కె.కుమారికి ద్విచక్ర వాహనాన్ని ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు.
అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక ప్రజలు సమస్యలను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్‌, జోనల్‌ కమిషనర్‌ కనక మహాలక్ష్మి, వర్క్స్‌ ఎఇ వెంకటరావు, నీటి సరఫరా విభాగం ఎఇ శ్రీహరి, 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాస్‌, 7వ వార్డు టిడిపి సీనియర్‌ నాయకులు పిల్లా వెంకటరావు, వంకాయల మారుతీప్రసాద్‌, కృష్ణమూర్తిపాత్రుడు, పిల్లా సూరిబాబు, యువ నాయకుడు జగుపిళ్ళ నరేష్‌, మొజ్జాడ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.