అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న కెకె.రాజు
ప్రజాశక్తి-మాధవధార : జివిఎంసి 51వ వార్డులో రూ.43.25 లక్షల వ్యయంతో గాంధీనగర్-1, 2, మహత్‌కాలనీలో బిటి.రోడ్లు, కళింగ నగర్‌లో డ్రెయినేజీ, కాలువల నిర్మాణాలకు ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు సోమవారం శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పులామాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 47వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, ఎఇ అర్చన, డైరెక్టర్లు పైడి శ్రీను, దిడ్డి రమేష్, 51వ వార్డు నాయకులు పైడి ప్రతాప్, తిరుమలరావు, పప్పల లక్ష్మణ్, అప్పారావు మాస్టర్, శ్యామ్, రత్న, రాణి, వరలక్ష్మి, లత, ధర్మవతి, వినోద్, గణేష్, సాదు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.










