రోడ్డు పనులను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ కెల్ల సునీత
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి కేంద్రకారాగారం ఎదురుగా గల రామకృష్ణాపురంలో రహదారుల నిర్మాణానికి సోమవారం కార్పొరేటర్ కెల్ల సునీత భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఈ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసిపి ఇన్‌ఛార్జి కెల్ల సత్యనారాయణ, గ్రామ సంఘం అధ్యక్షులు వంకర బాబూరావు, సభ్యులు కాకర గోవిందు, నల్ల సింహాచలం, నల్ల వీరబాబు, వెంకటేశ్వరరావు, లింగాల వెంకట శ్రీధర్, ఈరి నాగరాజు, రొట్ట సోమకాంత్ రంజిత్, షేక్ అబ్దుల్లా, చీకటి శ్రీను, నందిక సత్యనారాయణ పాల్గొన్నారు.










