ప్రజాశక్తి- సీతమ్మధార : వార్డు అభివృద్ధి ప్రణాళికలలో భాగంగా 45వ వార్డు నరసింహనగర్‌లో రూ.6.50లక్షలతో పార్కు అభివృద్ధి, రామచంద్రనగర్ వద్ద రూ.25లక్షలతో రామచంద్రనగర్, తారకరామ నగర్, ప్రసాద్ నగర్, గణేష్ నగర్లలో సిసి రోడ్లు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్, జివిఎంసి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ కంపా హనోక్ ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ప్రాధాన్యతా క్రమంలోనిధులు మంజూరు చేయించి, పనులు చేపడుతున్నట్లు రాజు వెల్లడించారు. కార్యక్రమంలో ఎఇ అర్చన, వార్డు వైసిపి అధ్యక్షులు పైడి రమణ పాల్గొన్నారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పరిశీలన
45వ వార్డు ఎఎస్ఆర్నగర్లో టిడ్కో ఇళ్లు నిర్మాణాలను స్థానిక కార్పొరేటర్ కంపా హనోక్‌తో కలిసి కెకె.రాజు పరిశీలించారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే అతి త్వరలో లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు.
25వ వార్డులో...
25వ వార్డు సీతంపేట, శాంతిపురంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన వినతుల మేరకు రూ.25లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు సారిపిల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు శంకుస్థాపన చేశారు. ఎఇ.శ్రీరామమూర్తి, సానబోయిన సురేష్, బోగవల్లి గోవింద పాల్గొన్నారు.










