ప్రజాశక్తి - ములగాడ : జివిఎంసి 61వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు వైసిపి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 61వార్డు పరిధి పల్లి వీధిలో రూ.34 లక్షలతో నిర్మించతలపెట్టిన సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు తదితర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొణతాల సుధాజగన్మోహనరావు, పిలకా రామ్మోహన్‌రెడ్డి, బోగవెళ్లి నాగభూషణం, దాడి సత్యనారాయణ, 90వ వార్డు నాయకులు నమ్మి శ్రీను, కొల్లి నూకరెడ్డి, చట్టి నూకరాజు, కర్రి బాలు, భూషా అప్పలరెడ్డి, పాండు, శ్రీనివాసరావు, దాసర రవి, మల్ల వాసు, సి హెచ్‌ఎ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ అన్నారు. జివిఎంసి 59వ వార్డులో ఆధునికీకరించిన 1086331, 1086332 సచివాలయాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ, ప్రజల జీవన ప్రమాణ స్థాయిలను, బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఎన్‌టిఆర్ సుజల ప్లాంట్ మరమ్మత్తులు నిమిత్తం ఆనంద్‌కుమార్ సొంత నిధులు రూ.60 వేలు ఖర్చుచేసి బాగుచేయటంతో ఆయనకు వార్డు కార్పొరేటర్, వార్డు పార్టీ ఇన్‌ఛార్జి, కాలనీవాసులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుర్రే పూర్ణ శ్రీ, నాయకులు సురేష్‌యాదవ్, పొట్టి మూర్తి, రేవల్ల సత్యనారాయణ, మీసాల పెంటారావు, స్పందన బాబూరావు, సంపత్, కిరణ్, నమ్మి శ్రీను, అమరావతి, గౌరీరెడ్డి, సన్యాసిరావు పాల్గొన్నారు.










