Oct 31,2022 23:40

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి

ప్రజాశక్తి- గాజువాక : జివిఎంసి 74వ వార్డు బిసిరోడ్డులోని ఎక్యూజె కల్యాణమండపం ప్రాంగణంలో రూ.20 లక్షలతో ఇంటర్‌ లాకింగ్‌ పేపర్‌ బ్లాక్‌ పనులకు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వార్డు కార్పొరేటర్‌ తిప్పల వంశీరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ, వార్డులో మిగిలిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో 66వ వార్డు కార్పొరేటర్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌, షఫీ, పెదిరెడ్ల ఈశ్వరరావు, మదీనావల్లి భాషా, ఇర్ఫాన్‌, ముస్లిం మైనారిటీ పెద్దలు, దేముడుబాబు పాల్గొన్నారు.