Oct 30,2022 22:20

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

ప్రజాశక్తి-గాజువాక : జివిఎంసి 74వ వార్డు పరిధి వైఎస్‌ఆర్‌.నగర్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం నుంచి సిద్దేశ్వరం, టిజిఆర్‌ నగర్‌, వెంపల్‌ నగర్‌ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే రహదారి నిర్మాణానికి వార్డు కార్పొరేటర్‌ తిప్పల వంశీరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రూ.50 లక్షలతో ఈ రహదారి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని తెలిపారు. కార్పొరేటర్‌ వంశీరెడ్డి మాట్లాడుతూ, గత వారం రోజులలో వార్డులో సుమారు రూ.85 లక్షలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొందేశి సత్యారావు, ఎన్‌వై నాయుడు, గోరుసు సత్యం, గొందేశి సత్తిరెడ్డి, దల్లి పైడికొండ, బొడ్డు గోవింద్‌, ఎస్‌ రాజారావు, లోకేష్‌, పూతి తాతరెడ్డి, రామలక్ష్మి, సుధ, విజయలక్ష్మి, వేంపడా ప్రసాద్‌, కొన రాజు, కొన వెంకటఅప్పారావు, దల్లి కుంచారావు, నందిక తాతారావు, పవన్‌ కుమార్‌, సోమరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.