Sep 24,2022 23:27

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మేయర్‌ గొలగాని, ఎమ్మెల్యే అదీప్‌రాజు

ప్రజాశక్తి-పెందుర్తి : మండలంలోని 94, 96, 97 వార్డుల పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అదీప్‌రాజు, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి శనివారం శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి రెండు కళ్లు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మేయర్‌ గొలగాని హరివెంకట్‌ కుమారి మాట్లాడుతూ, సుమారు రూ.4 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఆదిరెడ్డి మురళి, డి.రాజు, ఎల్‌జి.నాయుడు తదితరులు పాల్గొన్నారు