Sep 08,2022 23:54

భూమి పూజ చేస్తున్న మేయర్‌, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి పైనాపిల్‌ కాలనీ, శ్రీకృష్ణాపురం కాలనీల్లో వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత ఆధ్వర్యాన అభివృద్ధి పనులకు మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయ నిర్మల గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జివిఎంసి నిధులు రూ.35.15 లక్షలతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇ అప్పాజీ, వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాస్‌, కెెల్ల సత్యనారాయణ, శిరీషా, వెంకటరెడ్డి, సుబ్బారావు, భాస్కర్‌, బేత దుర్గారావు, గోవిందు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.