అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మేయర్
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 11వ వార్డు పరిధి ఆరిలోవ, బాలాజీనగర్, డ్రైవర్స్ కాలనీల్లో అభివృద్ధి పనులకు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మంగళవారం శంకుస్థాపన చేశారు. జివిఎంసి నిధులు రూ.45.70 లక్షల వ్యయంతో బాలాజీనగర్, డ్రైవర్స్ కాలనీల్లో బిటి రోడ్లు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వార్డుల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాస్, ఎఇ అప్పాజీ, వైసిపి నాయకులు సత్యనారాయణ, బోని శ్రీను, పద్మ, మోహన్‌రావు పాల్గొన్నారు.










