శంకుస్థాపన చేస్తున్న మేయర్ గొలగాని హరి వెంకటకుమారి
ప్రజాశక్తి-మాధవధార : జివిఎంసి 50వ వార్డు పరిధిలో ఒక కోటీ,15 లక్షల, 50 వేల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్, నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు శంకుస్థాపన చేశారు. సాయిరాం నగర్, సత్యానగర్, మాధవదార, వంశీనగర్, నరసింహ నగర్, మురళీనగర్, తెన్నేటినగర్‌లో బిటి రోడ్లు, సిసి రోడ్లు, డ్రెయిన్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు శంకరరావు, భరణికాన రామారావు, జోనల్ కమిషనర్ ఆర్‌జివి.కృష్ణ, శ్రీనివాస్, పప్పల సునీత, బగాతి విజరు, కృష్ణారావు, నారాయణస్వామి, వరదరాజులు, తిరుమలరావు, ఎం.లక్ష్మి, సోని, సరస, దమయంతి, రమేష్ పాల్గొన్నారు.










