Aug 13,2022 23:08

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి 8వ వార్డు పరిధిలో రూ.1.37 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే ముత్తం శెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేశారు. ముందుగా 8వ వార్డు పరిధి సుభాష్‌ నగర్‌, దసపల్లా లే-అవుట్‌, శాంతినగర్‌, ముబరక్‌ కాలనీ, వైఎల్‌పి లే-అవుట్‌, సాగర్‌నగర్‌ ప్రాంతంలో రోడ్లు, సీసీ కాలువల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 8వ వార్డు వైసిపి కార్పొరేటర్‌ లొడగల అప్పారావు ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దాదాపు రూ.100 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే టిడిపి, జనసేన మాత్రం ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్‌ లోడగల అప్పారావు, జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, లోడగల రామ్మోహన్‌, గుడ్ల పోలి రెడ్డి, మాధు చంటి, అల్లాడ ఉమ మహేశ్వరరావు, నొడగల రాంబాబు, సీరపు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.