ప్రజాశక్తి -పిఎం పాలెం : మధురవాడ సమీపంలో ఉన్న జివిఎంసి 6, 7 వార్డుల పరిధిలో రూ.3.60 కోట్లతో అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ముత్తంశెట్టి లకీëప్రియాంక మంగళవారం శంకుస్థాపన చేశారు.
ముందుగా 7వ వార్డు పరిధి పిలకవానిపాలెం, వాంబే కాలనీ, మానం ఆంజనేయులు కాలనీల్లో రోడ్లు, సిసి డ్రెయిన్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏడవ వార్డు వైసిపి అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు టిడిపి కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, పిల్లా వెంకటరావు, పోతిన హనుమంతు, పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు, ఆల్లడ లింగేశ్వరరావు, కుడితి రామారావు, శేషు,మీసాల అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
టిడిపి కార్పొరేటర్ ఆగ్రహం
వార్డులో అభివద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా తమకు ఎటువంటి సమాచారం అందడంలేదని 7వ వార్డు టిడిపి కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, పిల్ల వెంకటరావు జోనల్ కమిషనర్ మీద ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా మేడల్లో ఉన్న వారికి పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఏడవ వార్డులో నెలకొందని అవంతి శ్రీనివాసరావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరో వార్డులో బిటి రోడ్లు, కాలువలు, ఓపెన్ జీమ్ అభివృద్ధి పనులకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ డాక్టర్ ముత్తంశెట్టి లక్ష్మీప్రియాంక శంకుస్థాపనలు చేశారు. ముందుగా సేవా నగర్, కెత్రీ.కాలనీ, రేవల్ల పాలెం, లక్ష్మీవానిపాలెం, బక్కన్నపాలెం ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బక్కన్నపాలెంలో ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం వచ్చిన మూడేళ్ల కాలంలో 6వ వార్డులో అభివృద్ధి పనులకు రూ.67 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే రూ.24 కోట్ల అభివృద్ది పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇవి కాకుండా సంక్షేమ పథకాలు కోసం ఈ ఒక్క వార్డుకే రూ.28 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తంశెట్టి నందిష్, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత, సత్యనారాయణ, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, తహశీల్దార్ పాల్ కిరణ్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, పోతిన మూర్తిబాబు, రాయిన సాయి, 6వ వార్డు అధ్యక్షుడు బొట్ట అప్పలరాజు, పోతిన యల్లాజీ, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పోతిన ఉష, పిల్లా రమణబాబు, పోతిన శివ, గుంటూబోయిన సంజీవ్ యాదవ్, శియాద్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.










