ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 11, 13 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, వైసిపి తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల, 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత శంకుస్థాపన చేశారు. 11వ వార్డు బాలాజీనగర్‌లో రూ.20 లక్షలతో రోడ్లు, కాలువలు నిర్మాణానికి, 13వ వార్డు నగర శివారు రామక్రిష్ణాపురంలో జివిఎంసి నిధులు రూ 36.50 లక్షలతో ముంపుకు కారణమైన ఓపెన్ కల్వర్టు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయావార్డుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమాల్లో జివిఎంసి ఎఇ అప్పాజీ, 11, 13వ వార్డుల వైసిపి ఇన్‌చార్జ్‌లు గొలగాని శ్రీనివాసరావు, కెల్ల సత్యనారాయణ నేతలు కాకర గోవిందు, బాబూరావు, సుబ్బారావు, వెంకట రెడ్డి, బేత దుర్గారావు, పిల్లి వీర్రాజు పాల్గొన్నారు.










