Aug 30,2023 22:34

మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

* తన కోటా నిధుల పనులపై ఎందుకంత కక్ష
* ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
ప్రజా సంక్షేమం, వనరుల కల్పనలో భాగంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. తన కోటా నిధులను వెచ్చించే విషయంలో ఉద్దేశపూర్వకంగానే ఆటంకాలు సష్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ప్రణాళికా అధికారి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎంపీ లాడ్స్‌ నిధుల వినియోగంపై సమీక్షలో ఆయన మాట్లాడారు. పనుల పురోగతిపై పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌, ఐటీడీఏ, ఇతర శాఖల అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఆశించిన స్థాయిలో ఎంపీ నిధుల సద్విని యోగంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియతో పూర్తి పారదర్శ కంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అయితే గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రజలకు వనరులు సమకూర్చే విషయంలో ఇబ్బందులు సష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు దాదాపు రూ.13 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నామని, కానీ.. వీటి అమలులో రాజకీయ దురుద్దేశాలను అంటగడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, అధికార పార్టీ నాయకులు ఈ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.