
ప్రజాశక్తి -కొత్తకోట:ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిం చేందుకే గడపగడపకు మన ప్రభుత్వం చక్కని కార్యక్రమమని అనకాపల్లి ఎంపి భీశెట్టి సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. చీమలపాడు పంచాయితీ శివారు తాటిపర్తి, కొంజర్తి, సికయి పాడు తదితర ఎనిమిది గ్రామాలలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతోనే రూ.40 లక్షలతో సిసి రోడ్లకు నిదులివ్వడం జరిగిందన్నారు. జెడ్ కొత్తపట్నం -కొత్తకోట రోడ్డు మర్మతుకు వైసీపీ నాయకులు కోరారు. రోడ్డుకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కొంజుర్తిలో మరో రూ. 5లక్షలు సిసి రోడ్డుకు కేటాయిస్తామని ఎంపి సత్యవతి హామీ ఇచ్చారు. తాటి పర్తి గ్రామంలో పిడిరు పాటుకు గురైన 11 మంది యువకుల బాదిత కుటుంబాలను ఎమ్మెల్యే, ఎంపి తదితరులు పరామర్శించారు. జెడ్.కొత్తపట్నం రైతు భరోసా కేంద్రంలో వరి విత్తనాలను ఎంపి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజక వర్గ ఎన్నికల పరిశీలకుడు కోలా గురువులు, అనకాపల్లి జిల్లా వైసిపి అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎంపిపి పైల రాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ముక్కా మహలక్ష్మినాయుడు, సర్పంచ్ వంజరి గంగరాజు, లక్ష్మి సురేష్ డిసిఎంఎస్ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ, వైసీపీ జిల్లా కార్యదర్శి ఆదిమూర్తి పాల్గొన్నారు.