Nov 23,2022 00:00

ఎమ్మెల్యే కు వినతిపత్రం అందిస్తున్న కాలనీ వాసులు

ప్రజాశక్తి -మధురవాడ : జివిఎంసి 7వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కాలనీలో రూ.76.41 లక్షలతో డ్రెయినేజీ వ్యవస్థ, సిసి రోడ్లు, రూ.38.70 లక్షలతో పిలకవానిపాలెం - పోతినమల్లయ్యపాలెం సిసి రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణాల కోసం శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన వార్డు ప్రజలతో మాట్లాడుతూ, వార్డులోని సమస్యలపై ఆరాతీశారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరునడిగి తెలుసుకున్నారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్థానికులు ఎమ్మెల్యేకు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసిపి అధ్యక్షులు పోతిన శ్రీను, పోతిన హనుమంతురావు, కృష్ణమూర్తి పాత్రుడు, లింగేశ్వరవు, కుడితి రామారావు తదితరులు పాల్గొన్నారు.