
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
పట్టణంలోని 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం సాయంత్రం శంకుస్థాపనలు చేశారు. కల్కి టవర్స్ ఎదురుగా రూ.4.80 లక్షలతో నిర్మించనున్న పైపులైను, రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అలాగే పైబోయిన వెంకట రామయ్య వీధిలో ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో పైపు లైను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితోపాటు వంకా కృష్ణమోహన్ వీధిలో రూ.3,50,000 వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కర్రి భాస్కరరావు, దృశ్య కళల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మానికొండ వెంకటేశ్వరరావు, వార్డు ఇన్‌ఛార్జి సింగం సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ అనపర్తి శామ్యూల్, మున్సిపల్ ఇంజనీర్ డి.మురళీకృష్ణ పాల్గొన్నారు.