అభివృద్ధి పనులకు మంత్రి బుగ్గన భూమిపూజ
- పాల్గొన్న జడ్పి చైర్మన్ పాపిరెడ్డి
ప్రజాశక్తి - బేతంచెర్ల
మండలంలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామ పరిధిలో వెలిసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమ ంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేశారు. గురువారం నాడు మద్దిలేటి స్వామి ఆలయ ఇఒ పాండు రంగారెడ్డి, చైర్మన్ సీతారామ చంద్రుడుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూ.3.90 కోట్లతో నిర్మించిన స్వామివారి ఆలయానికి సంబంధి ంచిన శిలాఫలకాన్ని, శ్రీ చక్రకాలంలో స్వామివారి ప్రత్యేక అలంకరణ మక్కుటంగా నిలవనున్న మహా ప్రాకారం, మహా మండపం నిర్మాణానికై రూ.12.70 కోట్ల నిధుల పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు.
లక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో ముందుగా ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితులు రాజేష్ గురుతోపాటు జ్వాలా చక్రవర్తి, కళ్యాణ చక్రవర్తి ప్రధాన అర్చకులు మద్దిలేటి స్వామి పండితుల మంత్రోచ్ఛవాలతో కార్యక్రమం సాగింది. అనంతరం మంత్రికి, జడ్పి చైర్మన్‌లకు స్వామివారి జ్ఞాపకాలను తీర్థ ప్రసాదాలను పండితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకట్ రెడ్డి,జడ్పిటిసి మెంబర్ శివలక్ష్మి, బేతంచెర్ల మండలం తహశీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో వెంకన్న ,మాజీ ఆలయ చైర్మన్ లక్ష్మిరెడ్డి, బాబుల్ రెడ్డి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.










