ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 11వ వార్డు పరిధి బాలాజీనగర్, వినాయకనగర్, దుర్గమ్మ గుడి నుంచి డ్రైవర్స్ కాలనీ శ్మశాన వాటిక వరకు, ముస్తాఫా కాలనీ, అప్సర కాలనీ, భరత్‌నగర్ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి గురువారం శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అభివృద్ధే ధ్యేయంగా ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. రూ.29 లక్షలతో బాలాజీనగర్ నుంచి వినాయక టెంపుల్ వరకు బిటి రోడ్డు, రూ.35 లక్షలతో దుర్గమ్మ గుడి నుంచి డ్రైవర్స్ కాలనీ శ్మశానవాటిక వరకు బిటి రోడ్డు, రూ.55 లక్షలతో ముస్తాఫా కాలనీలో ముస్లిం సోదరులకు సామాజిక భవనం, రూ.39 లక్షలతో ముస్తాఫా కాలనీ, భరత్‌గన్, అప్సర కాలనీలో బిటి రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇ ఎం.వెంకటరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










