Feb 22,2023 22:11

ప్రజాశక్తి-విజయవాడ: స్థానిక మూడో డివిజన్‌లో అభివృద్ధి పనులకు నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా నగరంలో ఆయా డివిజన్లలో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రూ.89.33 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో పాటు రూ.76.20 లక్షల జిజిఎంపి గ్రాంట్‌ మొత్తం కలిపి రూ.165.53 లక్షల అంచనాలతో డివిజన్‌ పరిధిలోని తొమ్మిది ప్రాంతాలలో వివిధ అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ దేవినేని అవినాష్‌, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్‌ భిమిశిట్టి ప్రవల్లిక, చీఫ్‌ ఇంజనీర్‌ యం.ప్రభాకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చంద్ర శేఖర్‌ పాల్గొన్నారు.