Oct 01,2022 23:22

శంకుస్థాపన చేస్తున ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి-పాడేరు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభివృద్ధికి నాడు నేడు రెండవ విడత కింద ప్రభుత్వం కోటీ 27 వేలు మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు శనివారం ఆమె శంకుస్థాపన నిర్వహించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గత రెండేళ్లలో ఏజెన్సీ పాఠశాలల్లో అభివృద్ధి పనులు విస్తృతం అయ్యాయని చెప్పారు. కళాశాలల్లో సౌకర్యాలు కల్పించంతో విద్యార్థుల విద్యాభివృద్ధి ఎంతో దోహద పడుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్‌ కె.రమాదేవి మాట్లాడుతూ, ఈ నిధులతో కళాశాల భవనాల మరమ్మతు, టాయిలెట్లు, బోరు బావి నిర్మాణం, రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం, బోధన సామగ్రి, పెయింటింగ్స్‌, విద్యుత్‌ తదితర పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ట్రైకార్‌ చైర్మన్‌ ఎస్‌ బుల్లిబాబు, వైస్‌ ఎంపీపీ శివ, సర్పంచ్‌ కె.ఉషారాణి, సిబ్బంది పాల్గొన్నారు.