శంకుస్థాపనలో పాల్గొన్న ఎంపి ఎంవివి సత్యనారాయణ, మేయర్ గొలగాని
ప్రజాశక్తి - ఆరిలోవ : చినగదిలి సాయిబాబా ఆలయం నుంచి ఆరిలోవ అంబేద్కర్ భవన్ వరకు రెండు వరుసల రహదారి పనులు, కాలువల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.35 కోట్లతో రెండు వరుసల రహదారులు, కాలువల నిర్మాణానికి విశాఖ ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, విఎంఆర్‌డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణి, వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాసరావు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ రాజబాబు, బోని శివరామకృష్ణ, చొక్కర శేఖర్, జివిఎంసి అధికారులు పాల్గొన్నారు.










